ఏపీలో కరోనా సంచలనం.. అసలు ఏం జరుగుతుంది ?


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఒక్క రోజే 43 కొవిడ్‌ కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 87కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య 43 కొత్త కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌లో తెలిపింది.
ఇదీలావుంటే..

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రోజు ఉదయం 9గంటల వరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1637 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడినవారిలో 133 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 38 మంది మృత్యువాత పడినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.