ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు అగ్ర రాజ్యాలు సైతం అతలాకుతలం అవుతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి ఇప్పటికే చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అంతే కాదు ఏమాత్రం కరోనా లక్షణాలు అనిపించినా వెంటనే హాస్పటల్ లో చికిత్స తీసుకోవాలని..ఎవర్ని కలవకూడదని అన్ని ఆరోగ్య కేంద్రాలు , ప్రభుత్వాలు చెపుతున్నాయి. అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఓ యువతీ నాకు కరోనా సోకిందని అది అందరికి అంటిస్తానని హల్చల్ చేయడం వైరల్ గా మారింది.
డల్లాస్‌కు చెందిన లొర్నైన్ మరదియాగ అనే యువతి ఇటీవల స్నాప్‌చాట్‌లో కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. అందులో తనకు కరోనా పాజిటివ్ సోకిందని వివరించిన మరదియాగ.. ఈ వైరస్‌ను అందరికీ అంటిస్తానంటూ పేర్కొంది. ‘నేను వాల్‌మార్ట్‌కు వెళుతున్నా.. అక్కడ అందరికీ నేను వైరస్‌ను అంటిస్తాను. ఎందుకంటే నేను పోతే.. మీరు కూడా పోతారు’ అని కామెంట్లు చేసింది. ఈ వీడియోలు కాస్త వైరల్ అయ్యాయి. దాంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు ఉలిక్కి పడ్డారు పోలీసులు అప్రమత్తమై ఆయువతి అడ్రెస్ ను కనుక్కొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.