వరల్డ్ వైడ్ గా కరోనా మరణాల సంఖ్య ఎంతో తెలుసా..?

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా. ఎక్కడో చైనా లో పుట్టిన ఇది..ఇప్పుడు ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని మనుషుల ప్రాణాలు తీస్తుంది. కరోనా పేరు వింటే అన్ని దేశాలు వణికిపోతున్నాయి.

ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 42,322కు చేరగా.. ఈ వైరస్‌ బారిన 8,59,032 మంది పడ్డారు. అలాగే కరోనా బారి నుంచి కోలుకున్న వారు 1,78,101 గా సమాచారం. ఈ మహమ్మారి వల్ల ఎక్కువగా ఇటలీలో చనిపోయారు. అక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,05792కు చేరుకుంది. అమెరికాలో 4,054 మంది చనిపోగా, 1,88,578 మంది ఈ వైరస్‌తో బాధపడుతున్నారు.

ఇక భారత్ విషయానికి వస్తే.. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,663కు చేరగా, 50 మంది ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందారు. 150 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 325 కేసులు నమోదు కాగా, అక్కడ 12 మంది ప్రాణాలు కోల్పోయారు.