చాలా దేశాల్లో కరోనా టీకా ఎప్పుడు దొరుకుతుందా వేయించుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తాం.. రండి బాబూ రండి అంటున్నా ప్రజలు ముందుకు రావడం లేదు. అందులోనూ అమెరికాలో టీకా కార్యక్రమం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీంతో ప్రభుత్వం విన్నూత్నంగా ప్రచారం చేపట్టింది. కొన్ని వ్యాపార సంస్థలతో జత కట్టి టీకా వేయించుకుంటే ఫ్రీగా బీర్లు ఇస్తాం.. డోనట్స్ ఇస్తాం.. సేవింగ్స్ బాండ్స్ ఇస్తాం అంటూ ప్రచారం చేస్తున్నారు. అయినా, ఫలితం కనబడటం లేదు. అమెరికా స్వాతంత్ర దినోత్సవం జూలై 4న వస్తుంది. ఆలోపు దేశంలో 70 శాతం మంది పెద్దలకు మొదటి దఫా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ కోరుకుంటున్నారు. కానీ, ఆయన కోరుకుంటే అవ్వదు కదా. ప్రజల్లోనూ ఆ చైతన్యం ఉండాలి.