కోవిడ్ మీద పోరులో భాగంగా టీకాల పంపిణీ కార్యక్రమంలో భారతదేశం మరో కీలకమైన మైలురాయి దాటింది. ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య ఐదు కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారాన్నిబట్టి 8,23,046 శిబిరాల ద్వారా 5,08,41,286 టీకా డోసులిచ్చారు.
- 79,17,521 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోస్ కాగా, 50,20,695 ఆరోగ్య సిబ్బందికిచ్చిన రెండవ డోస్ లు
- 83,62,065 కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 30,88,639 డొసులు కోవిడ్ యోధులకిచ్చిన రెండో డోసులు
- 47,01,894 డోసులు 45-60 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
- 2,17,50,472 మంది 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన డోసులు ఉన్నాయి.