తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజుకు పెరుగుతుండడం తో ప్రజలు వణికిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పటిష్టంగా నడుస్తున్నప్పటికీ ఈ మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. తెలంగాణలో ఏకంగా ఆరుగురు చనిపోవడం టెన్షన్ పెడుతోంది. ఈ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది.
మార్చి 13-15 తేదీల మధ్య ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది పాల్గొనగా.. విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో.. అక్కడికి వెళ్లొచ్చిన వారిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు.