దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా కరోనా కేసులకు అడ్డుకట్ట వేసినట్లే అనుకున్నారు. కానీ ఢిల్లీ ప్రార్థనలతో అడ్డుకట్ట తెగిపోయింది. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారికీ కరోనా సోకడం..వారి నుండి మరికొంతమంది కి సోకడం తో భారత్ లో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. భారత్‌లో ఇవాళ్టి ఉదయం వరకు 2027 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 169 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ఇక ఏ ఏ రాష్ట్రాలలో ఇప్పటివరకు ఎన్ని ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే
మహారాష్ట్రలో అత్యధికంగా 335
కేరళలో 265 కేసులు
తమిళనాడులో 234
ఢిల్లీలో 152
రాజస్థాన్‌లో 120
ఉత్తరప్రదేశ్‌లో 177
ఆంధ్రప్రదేశ్‌లో 111
కర్ణాటకలో 110
తెలంగాణలో 97
గుజరాత్‌లో 87
మధ్యప్రదేశ్‌లో 86
జమ్మూకశ్మీర్‌లో 62
పంజాబ్‌లో 46
హర్యానాలో 43
పశ్చిమ బెంగాల్‌లో 37
బీహార్‌లో 24
చండీఘర్‌లో 17
అసోంలో 13
లడఖ్‌లో 13
అండమాన్ నికోబార్ దీవుల్లో 10
ఛత్తీస్‌గఢ్‌లో 9
ఉత్తరాఖండ్‌లో 7
గోవాలో 5
ఒడిశాలో 5
హిమాచల్‌ప్రదేశ్‌లో 3
పుదుచ్చేరిలో 3
జార్ఖండ్, మణిపూర్, మిజోరంలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.