సార్స్‌కోవ్-2 వైరస్‌లో మ్యూటేషన్ చెంది కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఒమిక్రాన్‌ను డెల్టాతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కొవిడ్ కొత్త వేరియంట్ (ఒమిక్రాన్) బయటపడిన నేపథ్యంలో, ముప్పు ఉన్నట్లు భావిస్తున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
- ప్రయాణికులంతా బయలు దేరడానికి ముందే స్వీయ ధ్రువీకరణ పత్రం, ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్‌ను అప్లోడ్ చేయాలి.
- ప్రయాణికులు విమానంలో అడుగుపెట్టడానికి ముందే వారివద్ద ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉందో లేదో విమానయాన సంస్థలు ధ్రువీకరించుకోవాలి.
నిబంధనలు వర్తించే దేశాలు
బ్రిటన్ సహా ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయిల్.