Site icon TeluguMirchi.com

భారతదేశం లో ఇప్పటివరకు ఎక్కువగా కరోనా తో మరణించింది ఎక్కడో తెలుసా..?

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఇక తగ్గినట్లే అనుకునే టైం లో ఢిల్లీ ఘటన తో మళ్లీ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం స్టార్ట్ అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో మార్చి 1 నుంచి 15 వరకు నిర్వహించిన మతపరమైన కార్యక్రమాల్లో విదేశీయులు సహా పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. విదేశీయులకు కరోనా ఉండడం తో ఆ కరోనా ఆ ప్రార్థనలకు వెళ్లిన వారందరికీ సోకడం జరిగింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి.

24 గంటల వ్యవధిలో దేశంలో 547 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 2,500దాటగా.. గడచిన 24 గంటల్లోనే 540కిపైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం 77 మంది మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 21 ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 423 కేసులు నమోదయ్యాయి.

Exit mobile version