దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొంతమంది దగ్గు, జలుబు ఉంటె కోవిడ్ వచ్చిందేమో అని భయపడుతున్నారు, కానీ అందరు బయటకెళ్ళి పరీక్షలు చేయించుకోవాలంటే గంటలు గంటలు లైన్ లో నిలబడాలి, రిసల్ట్ కోసం 24 గంటలు వేచి చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంటివద్దే కోవిడ్ పరీక్ష నిర్వహించుకునేందుకు కోవిసెల్ఫ్ కిట్ ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ సంస్థ- ఐసిఎంఆర్ ఢిల్లీ ఆమోదించింది. అయితే విచక్షణారహితంగా ఈ పరీక్ష చేసుకోరాదని, లక్షణాలు ఉన్నవారు, సూచించిన నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా చేసుకోవాలని ఐసిఎంఆర్ హెచ్చరించింది. అయితే ఈ పరీక్షకు ముక్కులో ఉన్న సొన ఉపయోగించాల్సి ఉంటుంది.