ఎక్కడో చైనా లోని వుహాన్ లో పుట్టి, జైత్ర యాత్ర కి బయలుదేరి ప్రపంచ దేశాలన్నిటిని తన పాదాక్రాంతం చేసుకుని…మానవాళి మనుగడకి అత్యంత ప్రమాదకారిగా పరిణమించిన మహమ్మారి కరోనా వైరస్ దాటికి మనుషులే కాదు వారికి అత్యంత సన్నిహితంగా మెదులుతున్న జంతువులకి కూడా సోకుతుంది…
మనకందరికీ తెల్సిన విషయమే…ఈ కరోనా మహమ్మారి కి మందు లేదు, దాని బారిన పడకుండా రోగ నిరోధక శక్తి పెంచుకోవటం ఒకటే మార్గమని…ఇప్పుడు మహమ్మారి మనుషలకే కాక, భూమి మీద వున్న జీవులన్నిటిని మడత పెట్టుకొని పోతున్నట్టుగా వుంది. ఈ మధ్య కాలంలో మనం వార్తలు చూస్తూనే వున్నాం…పులులు, మేకలు, గొర్రెలు కూడా ఈ మహమ్మారి బారిన పడినట్లు… quarantine లకి పంపినట్లుగా….
ఇవ్వన్నీ చూసాక జంతు ప్రేమికులు బెంబేలెత్తిపోతున్నారు… ఎక్కడ ప్రాణ ప్రధానంగా పెంచుకుంటున్న కుక్కలను కరోనా మడత పెట్టేస్తుందో అని భయపడిపోతున్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ కి తీసుకొని వెళ్ళి risk తీసుకోలేక… అతి జాగర్తలతో కుక్కలకు మనతో పాటు బలమైన తిండి మరియు విటమిన్స్ పోషక విలువగల తిండిని పెట్టాలని డిసైడ్ చేసుకొని ఈ -కామర్స్ లో తెగ కొని పారేస్తున్నారు… ఏ వెబ్ సైట్స్ లో చూసిన ‘స్టాక్ అవుట్’ అని బోర్డులు కనబడుతున్నాయి…. ఇలాంటి సప్లిమెంట్స్ కోసమే… ఈ -కామర్స్ వెబ్ సైట్స్ కూడా ఉన్నాయ్… www.1mg.com లాంటివి…
అంతేలెండి, మనతో పాటు ప్రేమప్రదంగా ఇన్నిసంవత్సరాలు పెంచు కున్న..అందులోనూ సృష్టిలో అంత్యంత విశ్వాసమైన…మనిషికి బాగా దగ్గరగా వుండే ఏకైక జీవి ‘కుక్క’ లను కొరోనా కోసం మనం ఎలాగ వదేలేస్తాం?… అది మానవత్వం ఎలాగ అవ్వతుంది?… వాటికీ కరోనా వస్తే మనకు అంటుకుంటుంది కదా?… అందుకేనేమో ఎప్పుడు లేనిది ఇప్పుడు జంతువులకి వాడే విటమిన్, సప్లిమెంట్స్ తెగ కొనేస్తున్నారు మన జనాలు …