Site icon TeluguMirchi.com

ఏపీలో కరోనా పై అనుమానాలు

ఏపీలో కరోనా పై అనుమానం వ్యక్తం చేశారు మాజీ సిఏం చంద్రబాబు. చంద్రబాబు హైదరాబాదు నుంచి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణకు జిల్లాను ప్రాతిపదికగా తీసుకోవాలే తప్ప, మండలాన్ని ప్రాతిపదికగా తీసుకుని వైరస్ ప్రభావాన్ని తక్కువ చేసి చూపించడం తగదని అన్నారు.

కరోనా ప్రభావాన్ని, మరణాలను తక్కువ చేసి చూపించడం వల్ల నష్టం జరుగుతుందని హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలు రెడ్ జోన్ పరిధిలోకి రావడం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని వ్యాఖ్యానించారు. అటు, సీఎం జగన్ కూడా ప్రధానితో సమావేశంలో కావాలనే కరోనా తీవ్రతను తగ్గించి చెప్పారని చంద్రబాబు ఆరోపించారు.

Exit mobile version