Site icon TeluguMirchi.com

జంతువులకు పాకిన కరోనా ..

ఇప్పటివరకు కరోనా వైరస్ మనుషులకు మాత్రమే అనుకున్నాం కానీ ఈ మహమ్మారి జంతువులను కూడా వదిలిపెట్టడం లేదు. తొలిసారిగా ఓ పులికి కరోనా సోకినట్లు తేలింది. అమెరికాలో కరోనా మహమ్మారి ఏ రేంజ్ ఉందొ చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అక్కడ మనుషులనే కాక జంతువులకు కూడా ఈ కరోనా సోకుతుంది. న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూలో మలయన్ జాతికి చెందిన నాలుగేళ్ల నదియా అనే ఆడ పులికి కరోనా వైరస్ సోకింది. వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.

నదియా కొద్ది రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. అనుమానంతో పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే.. నదియాతో పాటు మరో మూడు పులులు, మూడు ఆఫ్రికన్ సింహాలకు కూడా ఇలాంటి లక్షణాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ సోకిన పులులు, సింహాలు ఆహారం తీసుకోవడం బాగా తగ్గించాయని జూ సిబ్బంది తెలిపారు. జూలో జంతువులకు కరోనా ఎలా సోకిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాటి ఆలనాపాలనా చూసే జూ ఉద్యోగి ద్వారానే ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్లు జూ అధికారులు అనుమానిస్తున్నారు.

Exit mobile version