మూడో దశకు చేరిన కరోనా

కరోనా మహమ్మారిని కేంద్రం ఎంత కట్టడి చేయాలన్న కానీ కుదరడం లేదు..ఓ పక్క లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం విపరీతం అవుతూనే ఉన్నాయి. ఈ జిల్లా..ఆ జిల్లా కాదు అన్ని జిల్లాలో రోజు రోజుకు వైరస్ లు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం దేశం లో కొన్ని ప్రాంతాల్లో కరోనా మూడో దశకు చేరుకుందని డాక్టర్‌ రణ్‌దీప్‌ అన్నారు.

రణ్‌దీప్‌ మాట్లాడుతూ.. ‘దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరగడం ఆందోళనకరం. పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ (లోకల్‌ కాంటాక్ట్‌) ద్వారా వైరస్‌ సోకడాన్ని గుర్తించాం. దీనిని వైరస్‌ మూడోదశగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దశ దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే విస్తరించింది. దేశ వ్యాప్తంగా అత్యధిక భాగం కేవలం రెండోదశలో ఉండంటం కొంత ఉపశమనం కలిగించే అంశం. అయితే మూడోదశ అనేది మన దేశంలో ప్రస్తుతం ప్రారంభదశలోనే ఉంది. దానిని అదుపుచేయడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నాం. దానిని ఎంత త్వరగా అరికడితే అంతమంచింది. లేకపోతే మూడోదశ ఉధృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదు.’ అని హెచ్చరించారు.