స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

bay of bangleఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ర్టంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు
వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ర్టంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కోస్తా తీరంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని, సముద్రంలోకి వేటకు వెళ్లే
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.