Site icon TeluguMirchi.com

ఆందోళనల్లో గాయపడిన కానిస్టేబుల్ మృతి

rape-cop-constableఇండియా గేట్ వద్ద ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన కానిస్టేబుల్ సుభాష్ తోమర్ (45) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఢిల్లీలోని ఓ ఆస్పపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (మంగళ) ఉదయం మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. లోపారా మెడికల్ విద్యార్థినిపై అత్యాచార ఘటన నిరసన సందర్భంగా ఆదివారం నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో సుభాష్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మరోవైపు బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెకు వైద్యులు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.

Exit mobile version