సమానత్వ మనస్తత్వాన్ని పెంపొందించేందుకు క్లీన్ ఈక్వల్ మిషన్‌ను పరిచయం చేసిన ఐటీసీ నిమైల్


విశ్వసనీయ గృహ పరిశుభ్రత బ్రాండ్, వేపతో తయారైన ఐటీసీ నిమైల్ తన క్లీన్ ఈక్వల్ మిషన్ ద్వారా మరింత బాధ్యతాయుతమైన భవిష్యత్తు వైపు ఒక స్పృహతో ముందడుగు వేసింది. పలు నివాసాలలో ఇంటి పనులను, ముఖ్యంగా శుభ్రపరిచే ప్రాథమిక బాధ్యతను మహిళలు తీసుకుంటారు. ఆ పని వారే చేయాలని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. తదుపరి తరంలో అవగాహన పెంచడం, దీన్ని ప్రేరేపించడం ద్వారా శుభ్రపరచడంలో సమానత్వాన్ని పెంపొందించేందుకు అనువుగా ఈ కార్యక్రమాన్ని సంస్థ రూపొందించింది. క్లీన్ ఈక్వల్ మిషన్ అనేది భాగస్వామ్య బాధ్యతగా శుభ్రపరచడాన్ని ప్రోత్సహించేందుకు, పిల్లల కోసం వినూత్నమైన విద్యా మాడ్యూల్‌ను కలిగి ఉంది. సమాజంలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా, ఇది నేటి తరం బాలలకు శుభ్రంగా ఉండడం, పరిశుభ్రతకు సంబంధించిన ప్రాథమిక అంశాలతో పాటు స్వాతంత్ర్యం, సమానత్వపు లోతైన భావనతో ఎదిగేందుకు వీలు కల్పిస్తుంది.
పిల్లలు సాధారణంగా ఇంటిలో చేసే మొదటి పని శుభ్రపరచడం. చిన్న వయస్సు నుంచే పనులు చేయడం భవిష్యత్తులో మరింత సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితానికి పునాది వేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పనులు చేయడం ద్వారా వారు ఆత్మవిస్వాసాన్ని, జట్టుగా పని చేసే నైపుణ్యాలను పెంపొందించుకుంటూ విలువలతో కూడిన దృఢమైన భావాన్ని అభివృద్ధి చేసుకోవడంలో సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా, ఇది వారి భవిష్యత్తుకు కీలకమైన స్వాతంత్రాన్ని అందిస్తుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహిళల డబుల్స్ (టెన్నిస్)లో మాజీ ప్రపంచ నంబర్ 1, సానియా మీర్జా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సానియా మీర్జాతో పాటు ఐటిసి లిమిటెడ్ మార్కెటింగ్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ శ్రీనివాస్, గీతాంజలి దేవ్‌శాల ప్రిన్స్‌పల్, గీతాంజలి గ్రూపు విద్యా సంస్థల డైరెక్టర్ మాధవి చంద్ర మరియు గ్లెన్ డొమన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన నిష్ణాతులైన విద్యావేత్త, పేరెంటింగ్ మెంటార్ కిరణ్మయి చౌదరితో కలిసి క్రియాశీలకమైన చర్చాగోష్ఠిని నిర్వహించారు. ది ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ అచీవ్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్, ఫిలడెల్ఫియా, యూఎస్ఏకు చెందిన కిరణ్మయి చౌదరి క్లీన్ ఈక్వల్‌పై ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న తల్లిదండ్రులను మరింత మార్గదర్శనం చేశారు.

ఆకర్షణీయమైన, వయస్సుకు తగిన విద్యా కంటెంట్‌తో, ఈ కార్యక్రమం సానుకూలమైన, ఆహ్లాదకరమైన మరియు సాపేక్ష మార్గంలో బాధ్యతను స్వీకరించేలా పిల్లలను ప్రేరేపిస్తుంది. ఈ చొరవ పాఠశాలలు, తల్లిదండ్రులతో ఒక సహకార కార్యక్రమం కాగా, ఇది క్లీన్ ఈక్వల్ ఆలోచనను విశ్లేషించుకోవడంలో పిల్లలకు సహాయపడేందుకు, వారిని సమానత్వానికి విలువనిచ్చే బాధ్యతగల వ్యక్తులుగా ఎదిగేందుకు వీలు కల్పిస్తుంది.

ఈ చొరవను సానియా మీర్జా ప్రశంసిస్తూ, “ఐటిసి నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్‌లో భాగంగా ఉండడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రయత్నం నా విలువలు, బాధ్యతాయుతమైన తల్లిదండ్రుల అవసరాన్ని లోతుగా ప్రతిధ్వనిస్తుంది. ఇది కేవలం శుభ్రపరచడం కన్నా ఎక్కువ; ఇది భాగస్వామ్య బాధ్యత భావాన్ని పెంపొందించడం, ఆకట్టుకునే విధంగా చిన్న వయస్సు నుంచే సమానత్వం మనస్తత్వాన్ని పెంపొందించడానికి సంబంధించిన అంశం. మనలాంటి తల్లిదండ్రులు, పాఠశాలలు, పిల్లలు మరింత సమానమైన మరియు బాధ్యతాయుతమైన రేపటి కోసం సమిష్టిగా కలిసి పని చేసేలా ప్రోత్సహించే ఈ చర్చాగోష్ఠిని నిర్వహించినందుకు ఐటీసీ నిమైల్ బృందాన్ని నేను తప్పక అభినందించాలి!’’ అని పేర్కొన్నారు.

ఐటీసీ లిమిటెడ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమీర్ సత్పతి మాట్లాడుతూ, “ఐటీసీ నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్ చిన్న వయస్సు నుంచే సమానత్వ విలువలను పెంపొందించడం ద్వారా సానుకూల మార్పును తీసుకువచ్చేందుకు మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇంటి పనులకు బాధ్యత వహించడం, యాజమాన్య బాధ్యతలు తీసుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం అనేది సమాజంలో ఈ మార్పును ప్రేరేపించేందుకు ఒక ప్రాథమిక మార్గం. ఈ కార్యక్రమం పిల్లలు సమిష్టి కృషి, స్వాతంత్ర్యం, సాధికారతల భావాలను పెంపొందించడంలో సహాయపడుతుందని, భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతమైన పెద్దలుగా మారడానికి వారిని ప్రోత్సహిస్తుందని మేము విశ్వసిస్తున్నాము’’ అని ధీమా వ్యక్తం చేశారు.

నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్ అనేది సరళమైన ఇంకా శక్తివంతమైన ఆలోచనతో నిర్మించబడింది: ఇంటి పనులు, శుభ్రపరచడంతోపాటు, పనులు కన్నా ఎక్కువ; అవి జీవన నైపుణ్యాలను నేర్పడానికి, సొంత విలువను పెంపొందించేందుకు, పరిశుభ్రత, శుభ్రంగా ఉండడం, సమానత్వాన్ని పెంపొందించే అవకాశాలు. ఈ కార్యక్రమం పాఠశాలల ద్వారా నిమగ్నమవ్వడానికి ప్రయత్నిస్తూ, తల్లిదండ్రులు ఈ అభ్యాసాలను వారి పిల్లల జీవితాలలో ఆకర్షణీయమైన, వయస్సుకు తగిన కార్యకలాపాల ద్వారా ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది. నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్ హైదరాబాద్‌లో దాని మొదటి దశలో 1 లక్ష కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు చేరువైంది. రాబోయే కొద్ది నెలల్లో, ఈ చొరవ భారతదేశంలో 8 లక్షల కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు చేరువ అవుతూ, దాని విస్తరణను మరింత పెంచుకోనుంది.