ఆ డబ్బును లెక్కించాంటే క్యాషియర్లు కిందా మీదా పడాలి. కూలి మనుషును కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా మెషిన్ వచ్చాయి. ప్రతి బ్యాంకులో కూడా ఒకటి రెండు మూడు ఇలా బ్యాంకు స్థాయిని బట్టి మనీ కౌంటింగ్ మెషిన్‌ు ఉంటున్నాయి. అయితే చైనాలో ఒక మహిళ మాత్రం మిషిన్ కంటే రెట్టింపు స్పీడ్‌తో నోట్లను లెక్కిస్తూ తనకు మెషిన్‌తో పనిలేదు అని చెబుతుంది.
చైనాలోని షాంగ్ డాంగ్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పని చేసే క్యాషియర్ నిమిషంలో 550 నోట్లను లెక్కించి అద్బుతం అనిపించుకుంటుంది. నోట్లను లెక్క వేయడంతో పాటు వాటి డినామినేషన్ కూడా సరిగ్గా పెట్టడం, మొత్తం చేయడం చక చక చేసేస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా నోట్లను లెక్కించే వ్యక్తిగా ఆమె రికార్డును సొంతం చేసుకుంది. కావాంటే ఈ వీడియో చూడండి. వీడియో చూశాక మీరు కూడా ఈమెను గ్రేట్ అంటూ ఒప్పుకుంటారు.