Site icon TeluguMirchi.com

చార్మినార్ కు బాంబు బెదిరింపు

Charminarచార్మినార్ లో బాంబు పెట్టినట్టు ఆగంతుడు ఫోన్ చేయడంతో పాతబస్తీలో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు రంగంలోకి దిగారు. సందర్శకులను నిలిపివేసి బాంబు నిర్వీర్య బృందంతో తనిఖీలు చేపట్టారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టయిన నేపథ్యంలో గత కొద్దిరోజుల క్రితం వరకు కూడా పాతబస్తీలో 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. తాగా చార్మినార్ లో బాంబు బెదిరింపు తో మరోసారి పాతబస్తీలో ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version