ఆంధ్రా బ్యాంక్‌ విలీనంపై బాబు వ్యాఖ్యలు

సుదీర్ఘ కాలంగా తెలుగు వారితో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న ఆంధ్రాబ్యాంక్‌ను యూనియన్‌ బ్యాంకులో విలీనం చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఈ విషయమై తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రా బ్యాంక్‌తో తమకు ఉన్న అనుబంధంను గుర్తు చేసుకుంటూ వారు తమ బ్యాంక్‌ను విలీనంకు అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బ్యాంక్‌ విలీనంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆంధ్రా బ్యాంక్‌ విలీనంను తెలుగు ప్రజలు అంగీకరించడం లేదు. ఒకవేళ విలీనం అనివార్యం అయితే ఆంధ్రాబ్యాంక్‌ పేరును అలాగే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆర్ధికమంత్రికి రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రా బ్యాంక్‌తో తెలుగు వారికి ఉన్న అనుబంధంను అంత సులభంగా విడదీయలేనిది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కార్పోరేషన్‌ బ్యాంక్‌ మరియు ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్‌ బ్యాంక్‌లో కలిపేందుకు ప్రతిపాధనలు పరిశీలిస్తున్నట్లుగా ఇటీవలే ఆర్ధిక శాఖ ఒక ప్రెస్‌ నోట్‌లో పేర్కొనడం జరిగింది. అప్పటి నుండి ఆందోళనలు మొదలయ్యాయి.