చంఢీగడ్ -మనాలీ జాతీయ రహదారి పై దాదాపు 12 గంటల తర్వాత రాకపోకలు ప్రారంభమయ్యాయి. మండి జిల్లాలోని పాండో సమీపంలో భారీ కొండ చరియలు విరిగిపడడంతో ఈరహదారిని మూసివేసి రాకపోకలు నిలిపేశారు. దీంతో కుల్లు నుంచి మండి వెళ్లే ప్రయాణీకులు గంటల తరబడి ట్రాపిక్ లో చిక్కుకుపోయారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తన సిబ్బందిని మొహరించి సహాయక చర్యలు చేపట్టి…గంటల వ్యవదిలోనే విరిగిపడిన కొండచరియలు తొలగించడంతో రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి.