Site icon TeluguMirchi.com

పాక్‌కు చైనా సాయం చేస్తున్న విషయాన్ని దోమలు బయట పెట్టాయి

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్‌ నాయకులు కుక్కలా మొరుగుతూ ఇండియాపై యుద్దంకు వస్తాం అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. ఇండియా సైనికులు తలుచుకుంటే పాకిస్తాన్‌ మొత్తం కూడా వారం రోజుల్లోనే ఇండియా ఆధీనంలోకి వస్తుంది. కాని భారత్‌ ఎప్పుడు కూడా అలాంటి పని చేయాలని భావించదు. పాకిస్తాన్‌ ఆర్ధిక వ్యవస్థ చిద్రమైనా కూడా ప్రస్తుతం ఆ దేశంలో అణు కేంద్రంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌కు అణు సాయంను చైనా అంధిస్తుందని ఇండియా చాలా కాలంగా ఆరోపిస్తుంది. కాని చైనా మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు.

చైనా ఆ విషయాన్ని బయట పెట్టకున్నా అసలు విషయం బయటకు వచ్చింది. పాకిస్తాన్‌లో ఉన్న చైనా శాస్త్రవేత్తలు దాదాపు 200 మందికి డెంగ్యూ వచ్చింది. ఈ విషయాన్ని బయటకు చెప్పకున్నా పాకిస్థాన్‌కు చెందిన స్థానిక మీడియాలో వార్తలు వచ్చినట్లుగా తెలుస్తోంది. 200 మందికి డెంగ్యూ వచ్చింది అంటే ఇంకా మరెంత మంది చైనా శాస్త్రవేత్తలు అక్కడ ఉంటారో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేలాది మంది చైనా సైంటిస్ట్‌లను పాకిస్తాన్‌ వినియోగిస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై చైనా అధికారికంగా మాత్రం ఒప్పుకోవడం లేదు.

Exit mobile version