కేంద్రం మరోషాక్‌.. 2 లక్షలకు మించొద్దు

currencyగత సంవత్సరం నవంబర్‌లో నోట్ల రద్దు నిర్ణయంతో సాదారణ ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నోట్ల రద్దుతో పాటు ఆర్థిక విషయాలపై పలు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. ముఖ్యంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం మొదట మూడు లక్షలకు మించి లావాదేవీలు జరగవద్దని, అన్ని ఆన్‌లైన్‌లోనే జరిగి పోవాలని కండీషన్‌ పెట్టింది. అయితే ఆ పరిమితిని మరింత తగ్గించింది.

నేడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల మేరకు ఇకపై బ్యాంకుల్లో కేవలం రెండు లక్షల వరకు మాత్రమే లావాదేవీలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి లావాదేవీలు జరుపుకున్నట్లు అయితే 100 శాతం జరిమాన విధించబోతున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ప్రకటనతో సాదారణ ప్రజలు గందరగోళంకు గురి అవుతున్నారు. మరీ రెండు లక్షల లావాదేమీ జరపకుండా ఆపడం ఏంటని, అన్ని అవసరాలకు ఆన్‌ లైన్‌ పేమెంట్‌ను వాడలేం అని, అందుకే పరిమితి మునుపటి మాదిరిగా మూడు లక్షలు ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.