Site icon TeluguMirchi.com

నూతన విద్యావిధానానికి తెరలేపిన సీబీఎస్ఈ

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 2021-22 విద్యా సంవత్సరాన్ని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఒక్కో భాగంలో 50 శాతం సిలబస్‌ను చేర్చనున్నట్లు తెలిపింది. తొలి భాగానికి సంబంధించిన పరీక్షలను నవంబరు- డిసెంబర్‌లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించనున్నట్లు వివరించింది. అదేవిధంగా రెండో భాగం పరీక్షలను మార్చి-ఏప్రిల్‌లో నిర్వహించనన్నట్టు తెలిపింది. 10, 12 తరగతులకు బోర్డు నిర్వహించే పరీక్షలు విద్యా సంవత్సరం చివరికల్లా పూర్తి చేసేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీఎస్‌ఈ వెల్లడించింది.

Exit mobile version