Site icon TeluguMirchi.com

సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇలా లెక్కిస్తారట!

కరోనా మహమ్మారి దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దుచేసి సంగతి తెలిసిందే. అయితే త్వరలో విద్యార్థులకు పరీక్షలు లేకుండానే ఫలితాలు ఇవ్వనుంది. తాజాగా ఈ ఫలితాల వెల్లడి కోసం సిబిఎస్ఈ బోర్డు ఒక ఫార్ములాను సూచించింది. ఈ మేరకు వారి 10వ తరగతి మూడు సబ్జెక్టుల ఫలితాల ఆధారంగా 30%, 11వ తరగతి తుది పరిక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగా 30%, 12వ తరగతి యునిట్ టెస్టులు, మిడ్‌టర్మ్ లో సాధించిన ఫలితాల ఆధారంగా 40% మార్కులను లెక్కిస్తారు.

Exit mobile version