కరోనా మహమ్మారి దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దుచేసి సంగతి తెలిసిందే. అయితే త్వరలో విద్యార్థులకు పరీక్షలు లేకుండానే ఫలితాలు ఇవ్వనుంది. తాజాగా ఈ ఫలితాల వెల్లడి కోసం సిబిఎస్ఈ బోర్డు ఒక ఫార్ములాను సూచించింది. ఈ మేరకు వారి 10వ తరగతి మూడు సబ్జెక్టుల ఫలితాల ఆధారంగా 30%, 11వ తరగతి తుది పరిక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగా 30%, 12వ తరగతి యునిట్ టెస్టులు, మిడ్‌టర్మ్ లో సాధించిన ఫలితాల ఆధారంగా 40% మార్కులను లెక్కిస్తారు.