అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్లు ఈ రోజు విశాఖలో రెండో వన్డే ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖకు వచ్చిన కోహ్లీ, ఈ నగరంపై తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు. “అద్భుతమైన ప్రదేశం. విశాఖకు రావడాన్ని ఎంతో ప్రేమిస్తాను” అని ట్వీట్ చేశారు.
అయితే విరాట్ కోహ్లీ ట్వీట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. “వైజాగ్ అనే ప్రదేశం ఈ దేశం, ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతుంది. విశాఖ వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీతో పాటు టీమిండియాకి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
Glad that Visakhapatnam is emerging out to be the loved destination both nationally and globally. Wishing @imVkohli and the team a great match tomorrow. https://t.co/NXKw6cxLRg
— N Chandrababu Naidu (@ncbn) October 23, 2018
అలాగే ఈ రోజు ఆడే ఆటగాళ్ల జాబితాను తాజాగా బీసీసీఐ విడుదల చేసింది. ఈ రోజు వన్డేలో ఆడనున్న టీమిండియా ఆటగాళ్ల జాబితా విరాట్ కోహ్లీ (కెప్టేన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రిశబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ.
అలాగే టాస్ గెలిచి బాటింగ్ దిగిన టీం ఇండియా రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్కోర్ అయిదు ఓవర్ల కి ఒక వికెట్ నష్టానికి 29 పరుగులు వద్ద ఉంది.