లాక్ డౌన్ పై టీడీపీ తీర్మానం


టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా ప్రభావం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు .

కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని కేంద్రానికి , టీడీపీ పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలు, పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరారు.