భక్తులపై కేసులా!

tddp protestవైకుంఠ ఏకాదశి రోజున ధర్నా చేసిన భక్తులపై నమోదు చేసిన కేసులపై సర్వత్ర తీవ్ర వ్యతిరేకత వ్యక్త మోతుంది. భక్తులపై కేసులు పెట్టడం ఏంటని నిరశనలు వినిపిస్తున్నాయి. శ్రీవారి భక్తులపై టీటీడీ అధికారులు వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు బీజేపీ నేతలు సమాయత్తమైయ్యారు. అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవోలపై ప్రైవేట్ కేసును దాఖలు చేయనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.

ఇది ఇలావుండగా, ఈ వ్యవహారంపై స్పందించిన భద్రతాధికారి రాజశేఖర్ బాబు.. టీటీడీ చట్టం ప్రకారమే ఆందోళన చేసిన భక్తుల మీద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రోడ్డుపై బైఠాయించి సిబ్బంది విధులకు ఆటంకం కలిగించటం, ఇతర వాహనదారులకు అసౌకర్యం కలిగించటం వంటి అభియోగాలతో తిరుమలలోని టూ టౌన్ పోలీసులు సెక్షన్-341 ప్రకారం కేసు నమోదు జరిగిందని తెలిపారు.

ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..వైకుంఠ ఏకాదశి రోజున వీవీఐపీలకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారాని,దాంతో శ్రీవారి దర్శనం ఆలస్యం అవుతుందంటూ సామాన్య భక్తులు ఆందోళనకు దిగారు. అయితే తిరుమలలో ఆందోళనలు నిషేధం కావటంతో ధర్నా చేసిన భక్తుల పై ఏవీఎస్‌వో గోవిందరెడ్డి స్థానిక పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.