Site icon TeluguMirchi.com

గ్రేటర్‌ హైదరాబాద్‌ లో కరోనా కలకలం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ రోజు మరో 30 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ వెల్లడించారు. వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. కరోనా సోకిన వారిని కలిసిన వ్యక్తులకు కూడా వైద్య పరీక్షలు చేసినట్టు తెలిపారు.

కాగా హైదరాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉండటం ఆందోళనకరమని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా ప్రభావం ఎలా ఉంది? టెస్టింగ్‌ కిట్లు ఎన్ని ఉన్నాయో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో 67వేల టెస్టింగ్‌ కిట్లే ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారనీ.. మరి పెద్ద సంఖ్యలో ఉన్న హాట్‌స్పాట్లలోని ప్రజలకు పరీక్షలు ఎలా చేస్తారు? ఈ నెల 24 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Exit mobile version