తెలంగాణలో కరోనా పరిస్థితి ఏంటి ?

తెలంగాణలో కరోనా కంట్రోల్ కావడం లేదు. కొత్తగా మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. వీటిలో 90శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వచ్చాయన్నారు.

అలాగే కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలి ఆస్పత్రిని 1500 పడకల స్థాయికి తీర్చిదిద్దినట్టు తెలిపారు. ఈ నెల 20న ఈ ఆస్పత్రిని ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘10లక్షల పీపీఈ కిట్లు, 10లక్షల ఎన్‌95 మాస్కులు, ఆస్పత్రుల్లో గాగుల్స్‌, వైద్య పరికరాలు సమకూర్చుకుంటున్నాం. వైద్య సిబ్బందితో పాటు రక్షణ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు అందజేస్తున్నాం’’ అని వివరించారు.