Site icon TeluguMirchi.com

షాక్: తెలంగాణలో భారీగా కేసులు

తెలంగాణలో ఈ రోజు కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదయ్యాయి. కొత్తగా మరో 32 మందికి కరోనా పాజిటివ్‌ రాగా.. మరొకరు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. అన్ని ల్యబ్‌లు, ఆస్పత్రులను సిద్ధం చేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు ఒక్క రోజు వెయ్యి నుంచి 1100 మందికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.

ఇదీలావుంటే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌ కారణంగా 51 మంది మరణించారని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 324కు చేరింది. తాజాగా 905 కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,352కు చేరిందని తెలిపింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 8048 మంది చికిత్స పొందుతుండగా.. 979 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించింది.

Exit mobile version