ముంబయి జెట్ స్పీడ్ లో కేసులు


కేసులు ఆగడం లేదు. పెరుగుతూనే వున్నాయి. ఒక్క ముంబయి నగరంలో కొత్తగా 183 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు మరణించారు. తాజా కేసులతో కలిపి ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 1936కు చేరిందని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది.

కాగ దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1076 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, దీంతో దేశం మొత్తంమీద కేసుల సంఖ్య 11,439కి చేరిందని తెలిపారు. ఇప్పటి వరకు 377 మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్‌ బారిన పడిన వారిలో 11.41 శాతం మంది కోలుకున్నారని కేంద్రం ప్రకటించింది.