కరోనా : భారత్ కండీషన్ ఏంటి ?


కరోనా మహమ్మారి విజృంభణ భారత్‌లో కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు 13,835మందికి ఈ వైరస్‌ సోకగా.. వీరిలో 1767 మంది కోలుకున్నారనీ.. 452మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 3205 మందికి ఈ వైరస్‌ సోకింది. వీరిలో 300 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 194మంది ప్రాణాలు కోల్పోయారు. 24గంటల్లో కొత్తగా 1076 కేసులు, 32 మరణాలు నమోదైనట్టు కేంద్రం తెలిపింది.

ఇదీలవుంటే లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సవరణలు చేసింది. అటవీ ప్రాంతాల్లో గిరిజనులు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని వెల్లడించింది. అటవీ ఉత్పత్తులు, కలప సేకరణను వ్యవసాయ కార్యకలాపాల్లో చేర్చింది. కొబ్బరి, వెదురు, కోకో, సుగంధ ద్రవ్యాల సాగు, శుద్ధి, ప్యాకేజింగ్‌కు అవకాశం కల్పిస్తూ సవరణలు చేసింది.