కరోనా ఎఫెక్ట్ : “నారాయణ” ఆన్ లైన్ బాట

కరోనా కారణంగా స్వర్వం నిలిచిపోయింది. కేవలం ఇంటర్నెట్ ఆధారిక సేవలు మాత్రమే నడిస్తున్నాయి. అయితే ఈ సేవలని విధ్యా రంగంలో కూడా అమలు చేసింది నారాయణ గ్రూప్. కరోనా నేపధ్యంలో దేశం మొత్తం విధించిన లాక్‌డౌన్‌తో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదని నారాయణ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులకు శ్రీకారం చుట్టాయి.

ఈ క్లాసుల ద్వారా టీచర్‌ చెప్పే పాఠ్యాంశాలను నేరుగా ఇంట్లోనే వినవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డైలీ అసైన్‌మెంట్లు కూడా ఇందులోనే ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచీల పరిధిలో అమలు చేస్తున్నారు. రోజుకు సగటున పదివేల మందికి పైగా విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను వీక్షిస్తున్నారని, మొత్తంగా 75 వేల మందికి పైగా విద్యార్థులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందుతున్నారని నారాయణ విద్యాసంస్థలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.