ఒకే రోజులో వెయ్యి కేసులు


భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24గంటల్లో దేశంలో కొత్తగా 1211 కరోనా పాజిటివ్‌ కేసులు; 31 మరణాలు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. అలాగే, 179మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు తెలిపింది.

దేశంలో మే 3 వరకూ పొడిగించిన లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఏప్రిల్‌ 20 నుంచి అత్యవసర విషయాలకు మినహాయింపులు ఉంటాయని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. ముందు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకుంటారని తెలిపారు. లాక్‌డౌన్‌ అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని కూడా సహించే పరిస్థితి లేదని హెచ్చరించారు.