తెలంగాణలో ఇవాళ కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైనవాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 40 కేసులు, రంగారెడ్డి జల్లాలో 2, మరో ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు కరోనాబారిన పడిన వలస కూలీల సంఖ్య 37కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 1,414కి చేరాయి. తాజాగా 13 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మొత్తంగా 952 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.