ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం నిరుత్సవ పరిచేలా ఓ వార్త చెప్పింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ముప్పునుంచి మానవాళి బయటపడే అవకాశాలు ఇప్పట్లో లేవని అభిప్రాయపడింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకూ ఈ వైరస్ ముప్పు పొంచివుందని డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి డా.డేవిడ్ నాబర్రో అంచనా వేశారు. వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేంతవరకూ ఈ వైరస్ మనల్ని వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు.
ఇదీలావుంటే దేశంలో రేపటితో ముగియనున్న లాక్‌డౌన్ కొనసాగింపుపై రేపే స్పష్టత రానుంది. ప్రధాని నరేంద్రమోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ ప్రసంగంలో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయనున్నారు