కరోనా ట్రీట్ మెంట్.. ‘ఆరోగ్యశ్రీ’లోకి


రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణపై ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సమీక్ష ముగిసింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం దిల్లీకి వెళ్లిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టులేనని అధికారులు సీఎంకు వివరించారు. అందరికీ వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, దీని తర్వాత ఇంటింటి సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.

ఇదీలావుంటే సిఎం జగన్ .. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా లక్షణాలున్నట్టు అనుమానిస్తున్న వ్యక్తికి చికిత్స అందిస్తే 10,774 రూపాయలు తక్షణం చెల్లిస్తారు. దీంతో పాటు ఆ చికిత్స చేసిన వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ కింద మరో 5631 రూపాయల్ని చెల్లిస్తారు. అలా మొత్తంగా కరోనా వైద్యానికి 16,405 రూపాయల్ని ఆస్పత్రులకు చెల్లించేలా ఆరోగ్యశ్రీకి వర్తింపజేస్తూ ఆదేశాలు జారీచేశారు