ఏపీలో తహసీల్దార్‌కు కరోనా


ఏపీలో తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. అనంతపురం జిల్లాలో ఓ తహసీల్దార్‌కు కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ప్రకటించారు అనంతరం తహసీల్దార్‌ను అనంతపురంలోని కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు తహసీల్దార్‌ డ్రైవర్‌, అటెండర్‌, కార్యాలయ సిబ్బంది చిరునామాలను అధికారులు సేకరించారు. సిబ్బందిని వెంటనే క్వారంటైన్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

కాగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నిన్న సాయంత్రం 5 నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 34 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 473కి చేరింది.