తెలంగాణలో ఇవాళ మరో 38 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 26 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
మరో 10 మంది వలస కార్మికులకు కరోనా సోకగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడ్డ వలస కార్మికుల సంఖ్య 99కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,699కి చేరింది. ఇవాళ ఒక్కరోజే కరోనాతో ఐదుగురు బాధితులు మృతి చెందగా.. ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 45కి చేరింది.