దేశరాజధాని నగరంలోని నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్ నిర్వహించిన మతపరమైన కార్యక్రమం ద్వారా రెండు రోజుల్లోనే దేశంలో 647 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 960 మంది విదేశీ తబ్లీగీ జమాత్ కార్యకర్తలపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.
ఇదీలావుంటే మెదక్ జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంట్లో 12 మందికి పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి వైరస్ సోకినట్లు తేలిందని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు తెలిపారు. దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో పాల్గొన్న వ్యక్తికి పాజిటివ్ రాగా.. అతడి నుంచి భార్య, కుమారుడు, కోడలికి కరోనా వైరస్ సోకిందని ఆయన స్పష్టం చేశారు.