తేలిక పాటి బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్, బరువెంతో తెలుసా …

భారత రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ -డీఆర్‌డీవో అనుబంధ సంస్థ డీఎంఎస్ఆర్‌డీఈ తేలిక పాటి బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను తయారు చేసింది. బీఐఎస్‌ ప్రమాణాలతో రూపొందించిన ఈ జాకెట్‌ బరువు 9 కిలోలు. ఇంతకు ముందు తయారు చేసే బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ బరువు 10.4 కిలోలుగా ఉండేది. తేలిక పాటి జాకెట్‌ వల్ల సరిహద్దుల్లో సైన్యానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని డీఆర్‌డీవో పేర్కొంది.