Site icon TeluguMirchi.com

సినిమాల్లో అవకాశాల కోసం వ్యభిచారం చేస్తున్న ఇంజనీరింగ్‌ విద్యార్థిని

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడాలోని ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్‌ నిర్వహించడం జరిగింది. ఆ రైడ్‌లో పలువురు అమ్మాయిలతో పాటు, కొంతమంది విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అమ్మాయిల్లో 19 ఏళ్ల అమ్మాయి ఉండటం ఆశ్చర్యంను కలిగించింది.

ఆమె సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. సినిమాల్లో ఛాన్స్‌లకు ప్రయత్నించాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతున్నాయని, ఫొటో షూట్‌లతో పాటు కాస్ట్యూమ్స్‌ ఖరీదుగా ఉండాలని ఉద్దేశ్యంతో తాను ఈ పనిలోకి దిగినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. మరో వైపు ఆమె ఇంజనీరింగ్‌ కూడా చదువుతున్నట్లుగా పోలీసులకు చెప్పుకొచ్చింది.

తన తల్లిదండ్రులు తాను ఇంజనీరింగ్‌ చదువుతున్నట్లుగా అనుకుంటున్నారు. కాని తాను మాత్రం సినిమాల్లో ఆఫర్లు పొందేందుకు ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఆమెను పోలీసు శాఖకు చెందిన రెస్క్యూ హోంకు పంపించడం జరిగింది. ఆ వ్యభిచార గృహం నడుపుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.

Exit mobile version