బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు


వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వెయిన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ టీ20 లీగ్ టోర్నీల్లో మాత్రం పాల్గొననున్నట్లు అతను చెప్పాడు. 2004లో ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్ తో వెస్టిండీస్ తరపున బ్రావో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 164 వన్డేలు ఆడిన బ్రావో 2968 రన్స్ చేసి, 199 వికెట్లు తీశాడు. అలాగే 40 టెస్టులు ఆడిన బ్రావో 2200 పరుగులు చేసి, 86 వికెట్లు తీశాడు. మరియు 66 టీ20ల్లో బ్రావో 1142 పరుగులు చేసి, 52 వికెట్లు తీశాడు.

బ్రావో వెస్టిండీస్ కి 2012, 2016 ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ టీమ్ కి గొప్ప ఆల్ రౌండర్ అయ్యాడు. చివరిసారిగా 2010లో శ్రీలంకపై చివరి టెస్ట్ ఆడాడు. 2014లో భారత్‌పై ఆఖరి వన్డే ఆడిన బ్రావో.. 2016లో పాక్‌పై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. బ్రావో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిథ్యం వహించి, చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో భాగమయ్యాడు. అలాగే బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రినిగేడ్స్, పీఎస్ఎల్‌లో పెషావర్ జల్మీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.