డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వాయిదా వేసిన అన్ని పరీక్షలు ఈ నెల 23, 24వ తేదీలలో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ 28 & 29 తేదీలలో రద్దైన పరీక్షలు తిరిగి ఈ నెల 23, 24వ తేదిలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు: www.braouonline.in లో సంప్రదించొచ్చు అని సూచించారు.