‘బ్రెయిన్ స్ట్రోక్’ పై అవగాహన కార్యక్రమం ప్రారంభించిన యశోద హాస్పిటల్స్

యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ లో “వరల్డ్ స్ట్రోక్ డే” సందర్భంగా “జాయిన్ ద  ఫైట్ ఎగైనెస్ట్ స్ట్రోక్” పేరిట బ్రెయిన్ స్ట్రోక్‌ అవగాహన కార్యక్రమన్ని  హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్, శ్రీ. అంజని కుమార్ గారు ఈ రోజు వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ లో ప్రారంభించారు. పక్షవాతం.. తెలియకుండానే మనిషిని కుంగదీసే ప్రమాదకర వ్యాధి. అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించే వ్యక్తిని అకస్మాత్తుగా వికలాంగుడిగా మార్చేస్తుంది. చివరికి ప్రాణాలు కూడా తీస్తుంది.  పక్షవాతం ఎక్కువగా పురుషుల్లోనే ఎక్కువగా వస్తుంది. దురలవాట్లు, దీర్ఘకాలిక వ్యాధులే ఇందుకు కారణం.  ఇక డయాబెటీస్ (మధుమేహం), రక్తపోటు, స్థూలకాయం సమస్యలుంటే పక్షవాతం పొంచివున్నట్లే.  చాలామందిలో 50 ఏళ్లు వచ్చిన తర్వాత పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వయస్సు మీదపడిన తర్వాత ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. అని శ్రీ. అంజని కుమార్ అన్నారు.

   చిన్నవయస్సులోనే ఇప్పుడు పక్షవాతం బారిన పడుతున్నవాళ్ల సంఖ్య ఎక్కువవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు, అంగవికలత్వానికి రెండో కారణంగా పక్షవాతం మారింది. భారతదేశంలో ఒక సంవత్సరంలో ప్రతి 1,00,000 మందిలో 145 నుండి 154 మంది  స్ట్రోక్ కు గురవుతున్నరని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి.  ఇందులో మొదటిసారి స్ట్రోక్ వస్తున్న వారిలో ఐదవ వంతు మంది 40 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు గలవారని కూడా గుర్తించబడింది. అయితే పక్షవాతం బారిన పడ్డామని కుంగిపోనవసరంలేదు. స్ట్రోక్ వచ్చిన తరువాత వీలైనంత త్వరగా హాస్పిటల్ కి రాగలిగితే పక్షవాతం వచ్చినా కూడా ఎప్పటిలాగే జీవించే వీలుంటుంది. ఇంట్లో పక్షవాతం వచ్చిన రోగి ఉంటే కుటుంబమంతటి పైనా ఆ ప్రభావం ఉంటుంది. పక్షవాతం రావడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. మధుమేహం కూడా కారణమవుతుంది. బీపీ మధుమేహం ఇంతకుముందైతే అరవయ్యేళ్ల వయసులో కనిపించేది. కాని ఇప్పుడు మూడు పదుల్లోనే కినిపిస్తున్నాయి. అందుకే పక్షవాతం కూడా ఈ వయసువల్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోకుండా జంక్ ఫుడ్ కి అలవాటు పడటం, పబ్ కల్చర్ వల్ల స్మోకింగ్ ఆల్కహాల్ ప్యాషన్ అయిపోయారు. డ్రగ్స్ కు కూడా అలవాటు పడుతోంది నేటి యువత. ఇవన్నీ కూడా పక్షవాతానికి కారణమయ్యేవే. మారో ముఖ్య కారణం అధిక ఒత్తిడి. కార్పోరేట్ ఉద్యోగాలు పెరిగిన తరువాత చిన్న వయసులోనే అధిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దాంతో నిండా ముప్పయ్యేళ్ళు దాటకుండానే పక్షవాతానికి గురవుతున్నారు. ఇలాంటి జీవనశైలి సంబంధిత కారణాలతో పాటు జన్యుపరమైన కారణాలు కూడా పక్షవాతం రావడానికి దోహదపడుతాయి. చిన్నారుల్లో గుండెజబ్బుల వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలెక్కువ. ఆ తర్వాత సికిల్ సెల్ అనీమియా, మెయా-మెయా అనే వ్యాధి (దీనిలో రక్తనాళాలు సన్నగా అవుతాయి) లాంటివి చిన్నపిల్లల్లో పక్షవాతం రావడానికి కారణమవుతాయి.  “బ్రెయిన్ స్ట్రోక్” తో ఇక భయం లేదు…! వేగంగా స్పందిస్తే ‘పక్షవాతం’  ముప్పు నుండి రక్షణ ఉంటుంది. అని  యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. ఎస్. రావు తెలిపారు.

Also Read :  పాక్ క్రికెటర్లకు భారత్ గట్టి షాక్: యూట్యూబ్‌లో నిషేధం

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మాటలో తేడా రావడం, నత్తి, మాట్లాడలేకపోవడం, విన్నది అర్ధం చేసుకోలేకపోవడం, మూతి పక్కకి వెళ్ళిపోవడం (ఫేషియల్ పెరాలసిస్), ఒక వైపు చెయ్య లేదా కాలు బలహీనం కావడం, నడిస్తే అడుగులు తడబడటం, ఒకరు ఇద్దరుగా కనిపించడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సిటి స్కాన్ చేసి ట్రీట్ మెంట్ మొదలుపెట్టాలి. పక్షవాతం వచ్చినా నలుగున్నర గంటల లోపు చికిత్స అందిoచగలిగితే శరీరం చచ్చుబడకుండా కాపాడవచ్చు. పక్షవాతానికి ఒకప్పుడు ట్రీట్ మెంట్ లేదు. కానీ ఇప్పుడు గత 15 నుండి 20 ఏళ్లుగా చికిత్స ఉంది. పక్షవాత లక్షణాలు కనిపించిన మొదటి నాలుగున్నర గంటలలోగా హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ మొదలుపెడితే  అవకరాలు ఏర్పడకుండా ఉంటాయి. ప్రాణాపాయం తప్పుతుంది. హాస్పిటల్ కి వెళ్లగానే మొదట సిటి స్కాన్ చేస్తారు. దీనిలో రక్తనాళం చిట్లి రక్తస్రావం కావడం వల్ల పక్షవాతం వచ్చిందా లేక బ్లాక్ వల్ల వచ్చిందా అనేది తెలుస్తుంది. రక్తస్రావం వల్ల కాకుండా బ్లాక్ వల్ల వచ్చిన ఇస్కి మిక్ (టిపిఎ) లేదా టేనెక్టి ప్లేస్ ఇంజెక్షన్. ఇలా ఇంజక్షన్ ఇవ్వడాన్ని థ్రాంబోలైటిక్ థెరపి అంటారు. దీనివల్ల అప్పటివరకు చచ్చుబడిన భాగాల్లో మెరుగుదల ఉంటుంది. ఈ ఇంజక్షన్ వల్ల రక్తసరఫరాకు ఆటంకంగా ఉన్న గడ్డ కరిగిపోయి రక్తనాళం తెరుచుకుంటుంది దాంతో రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. ఫలితంగా కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాడీకణాలకు అక్సిజన్ అంది, ఇoప్రూవ్ అవుతాయి. మెకానికల్  థ్రాంబెక్టమీ చేస్తారు. అంటే ఎండో వాస్కులర్ థెరపి ద్వారా కెథటక్ పంపి, క్లాట్ తీసేస్తారు. ఇది 6 గంటలలోపు చేయాలి కొందరిలో 24 గంటల లోపు కూడా చేయవచ్చు. అని  యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ & స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్. ఆర్. ఎన్. కోమల్ కుమార్ అన్నారు.

Also Read :  పాక్ క్రికెటర్లకు భారత్ గట్టి షాక్: యూట్యూబ్‌లో నిషేధం

చాలా దేశాల్లో పక్షవాతానికి త్వరగా చికిత్స అందించేందుకు ప్రత్యేకమైన అoబులేన్స్ యూనిట్లు ఉంటాయి. వీటిని మొబైల్ స్ట్రోక్ యూనిట్స్ అంటారు. ఈ అంబులెన్స్ లోనే సిటి స్కాన్, డాక్టర్, నర్సు అందరూ ఉంటారు. పేషెంట్ దగ్గరికి వెళ్లగానే అదే అంబులెన్స్ లో సిటి స్కాన్ చేసి, అక్కడే ఇంజక్షన్ ఇస్తారు. ఇలాంటి యూనిట్లను ఇక్కడ కూడా ప్రారంబించే ఆలోచన ఉంది. అయితే మన దగ్గరి మొబైల్ స్ట్రోక్ యూనిట్ లో సిటి స్కాన్ ను ఉంచలేం. అందువల్ల పేషెంట్ ను సిటి స్కాన్ చేయించుకుని రిపోర్ట్ వాట్స్ ప్ లో పంపమని చెప్తాం. ఈ లోపు అంబులెన్స్ పేషెంట్ దగ్గరకి చేరుకుంటుంది. అక్కడే వెంటనే ఇంజక్షన్ చేసేసి హాస్పిటల్ కి తరలిస్తారు. పేషెంట్ హాస్పిటల్ దాకా వచ్చే టైం సేవ్ అవుతుంది. థ్రాంబెక్టమీ జనరల్ అనెస్థిషియా అవసరం లేని సర్జరీ ఇది. కేవలం లోకల్ అనెస్థిషియాతో పక్షవాతం వచ్చన 24 గంటల్లోగా ఈ థ్రాంబెక్టమీ చేస్తే మంచి ఫలితాలుంటాయి.  అని  యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో & ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్. సురేష్ గిరగాని అన్నారు.