గౌలిగూడ చెందిన ఓ యువతీ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇటీవలే ఆమెను పేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయమైయ్యాడు..తన తండ్రి చనిపోయాడని, తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిపాలైందని మాయమాటలు చెప్పి ఆమె దగ్గరినుండి 60 వేలు, బంగారు ఆభరణాలు కాజేశాడు. విషయం తెలుసుకున్న ఆమె తండ్రి కుమార్తెను నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో సదరు యువకుడి ఫై కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసాడు ఆ తండ్రి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.