'పేస్ బుక్' లో యువతీ కి మాయమాటలు చెప్పి డబ్బులు కాజేసాడు..

fb-chatఇటీవల కాలం లో యువత అంత పేస్ బుక్ లో బిజీ అవుతున్నారు..ఎక్కువ టైం పేస్ బుక్ చాట్ లోనే మునిగిపోతున్నారు..ఇదే అదును చేసుకొని కిందరు కేటుగాళ్లు యువతులకు మాయమాటలు చెప్పి వారి దగ్గరినుండి డబ్బులు కాజేసే పని చేయడం మొదలు పెట్టారు..తాజాగా అలాంటి ఘటనే గౌలిగూడ లో వెలుగులోకి వచ్చింది.
గౌలిగూడ చెందిన ఓ యువతీ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇటీవలే ఆమెను పేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయమైయ్యాడు..తన తండ్రి చనిపోయాడని, తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిపాలైందని మాయమాటలు చెప్పి ఆమె దగ్గరినుండి 60 వేలు, బంగారు ఆభరణాలు కాజేశాడు. విషయం తెలుసుకున్న ఆమె తండ్రి కుమార్తెను నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో సదరు యువకుడి ఫై కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసాడు ఆ తండ్రి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.