కరోనా వైరస్ ఎవరినీ వదలడంలేదు. చివరకు బ్రిటన్ ప్రధాని కూడా కరోనా బారిన బడ్డారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో కొన్ని రోజుల క్రితం బోరిస్ జాన్సన్‌ను లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో చేర్చారు.
కాగా కరోనా వైరస్ చికిత్స నిమిత్తం ఐసీయూలో చేరిన ఆయన ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ డాక్టర్స్ కి నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను’’ అని బ్రిటన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రి సిబ్బందిని ఉద్దేశించి అన్నారు.
కాగా ఇప్పటి వరకు బ్రిటన్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 78 వేలకు చేరింది. నిన్న ఒక్కరోజే 10,000 కొత్త కేసులు నమోదయ్యాయి. సుమారుగా 9 వేల మంది మరణించారు.